మంత్రి హరీశ్ రావు చరిత్ర బయటపెడతా: ఈటల హెచ్చరిక
- మంత్రి హరీశ్ రావుకు మతి భ్రమించింది
- నాపై చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధం
- హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు రావాలి
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ మంత్రి హరీశ్ రావు తనపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి హరీశ్ రావుకు మతి భ్రమించిందని ఆయన చెప్పారు. హరీశ్ రావు చరిత్ర బయటపెడతానని ఆయన హెచ్చరించారు.
తన మీద చేసిన ఆరోపణలపై చర్చకు తాను సిద్ధమని, చర్చించేందుకు హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు రావాలని సవాల్ విసిరారు. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు తానే చేస్తానని చెప్పారు. హరీశ్ రావు ఓ తోపు అని అనుకుంటున్నారా? అని ఈటల ప్రశ్నించారు. హరీశ్ రావు నిర్వాకంపై ప్రజలు చీదరించుకుంటున్నారని ఆయన చెప్పారు. హుజూరాబాద్‌లో హరీశ్ నడిచే రోడ్లు ఎవరు వేశారని ఆయన నిలదీశారు. హరీశ్ రావు సీఎం సీటుకే ఎసరు పెట్టాడని ఈటల అన్నారు.