టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారు: తెలంగాణ అధికారులపై బీజేపీ ఏపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపాటు
- తెలంగాణ అధికారులు తమ బాధ్యతలు మరచి ప్రవర్తిస్తున్నారు
- గతంలో 100 టీఎంసీల కంటే ఎక్కువ నీరు సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి
- తెలంగాణ బాధ్యత వహించాలి
- ఏపీ ప్రజల తాగునీరు కంటే మీకు విద్యుత్ ముఖ్యమా కేసిఆర్ గారు?
కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి బాధ్యతారాహిత్యంగా ఉందంటూ బీజేపీ ఏపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిన్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణ వినిపించిన వాదనలపై విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ ట్విట్టర్ లో అభ్యంతరాలు తెలిపారు.
'తెలంగాణ అధికారులు తమ బాధ్యతలు మరచి టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లాగా కేఆర్ఎంబీ సమావేశంలో మాట్లాడటం సిగ్గుచేటు. తెలంగాణకు ఇప్పటి వరకు ఉన్న నీటి వాటా కాకుండా 50:50 చొప్పున పంపణీ చేయాలని అడగడం కావాలని వివాదం చేయడమే' అని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
'గతంలో 100 టీఎంసీల కంటే ఎక్కువ నీరు సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి రావడానికి తెలంగాణ బాధ్యత వహించాలి. వరద జలాలను నీటి వాటాల్లో జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డును డిమాండ్ చేయడం గొంతమ్మకోరిక లాంటిది' అని ఆయన అన్నారు.
'ఏపీ ప్రజల తాగునీరు కంటే మీకు విద్యుత్ ముఖ్యమా కేసిఆర్ గారు? కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. క్యారీ ఓవర్ స్టోరేజ్ ప్రత్యేక అకౌంట్ పెట్టాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ప్రాక్టికల్ గా సాధ్యం కాదని తెలిసి వివాదం చేస్తున్నారు' అని విష్ణు వర్ధన్ రెడ్డి విమర్శించారు.