దిశ చట్టం పేరుతో చేస్తోన్న మోసాన్ని ఇకనైనా ఆపాలి: లోకేశ్

  • శాంతియుతంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తోన్న వారిని అరెస్టు చేశారు
  • మహిళలకు భద్రత కల్పించడంలో జ‌గ‌న్ ప్రభుత్వం విఫ‌లం
  • ఇప్పుడు ఏకంగా మహిళలకున్న నిరసన తెలిపే హక్కును హరిస్తోంది
మహిళలకు రక్షణ కల్పించాలంటూ నిర‌స‌న చేప‌డితే కొంద‌రిని అరెస్టు చేశారంటూ టీడీపీ నేత నారా లోకేశ్ మండిప‌డ్డారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌పై శ్ర‌ద్ధ పెట్ట‌కుండా అక్ర‌మంగా అరెస్టులు చేయ‌డంపైనే పెడుతున్నారని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.

'మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన వైఎస్ జ‌గ‌న్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా మహిళలకున్న నిరసన తెలిపే హక్కును కూడా హరిస్తోంది. దిశ చట్టం పేరుతో చేస్తోన్న మోసాన్ని ఇకనైనా ఆపి, మహిళలకు రక్షణ కల్పించాలంటూ శాంతియుతంగా దిశ పోలీస్ స్టేషన్ల ముందు తెలుగు మహిళ, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం, హౌస్ అరెస్టులు చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. టీడీపీ నాయకుల నిర్బంధం, అక్రమ అరెస్టులపై పెడుతున్న శ్రద్ధ మహిళల రక్షణ కోసం పెట్టాలి' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.


More Telugu News