డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నది నేను కాదు.. మీడియాపై మండిపడ్డ హీరోయిన్ సోనియా అగర్వాల్!
- మోడల్ బదులు హీరోయిన్ ఫొటో వేసిన కొన్ని వెబ్‌సైట్లు
- '7జీ బృందావన్ కాలనీ' హీరోయిన్ ఫొటోతో వార్తలు
- సదరు మీడియా సంస్థలపై సీరియస్
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో.. కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహం ప్రదర్శించాయి. ఒక మోడల్ బదులు హీరోయిన్ ఫొటోతో వార్తలు ప్రచురించేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో.. నటి సంజన, కన్నడ నటి రాగిణి ద్వివేది, బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి అరెస్టయిన సంగతి తెలిసిందే. వీరంతా తర్వాత బెయిలుపై బయటకు వచ్చారు.
ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన సోనియా అగర్వాల్ అనే మోడల్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో వారిని చూసి భయపడిన ఆమె బాత్రూంలో దాక్కుందట. సోనియా ఇంట్లో డ్రగ్స్ లభించడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ వార్తను ప్రచురించిన కొన్ని మీడియా వెబ్‌సైట్లు.. మోడల్ సోనియా ఫొటో బదులుగా సినీ నటి సోనియా అగర్వాల్ ఫొటో వాడేశాయట.
కొన్ని వెబ్‌సైట్లు అయితే మరింత అత్యుత్సాహం ప్రదర్శించి అసలు హీరోయినే డ్రగ్స్ కేసులో ఇరుక్కుందని ప్రచురించాయి. ఈ విషయం హీరోయిన్ సోనియా చెవికి చేరడంతో ఆమె మండిపడ్డారు. '7జీ బృందావన్ కాలనీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఆమె.. తనపై వస్తున్న వార్తలను తప్పుబట్టారు. ఈ వార్తలు ప్రచురించిన మీడియా సంస్థలు, జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.