30 లక్షల భారతీయ ఖాతాలపై బ్యాన్ విధించిన వాట్సాప్.. అసలెందుకంటే..!
- కొత్త ఐటీ రూల్స్ ప్రకారం వివరాలు వెల్లడించిన సంస్థ
- తమకు వచ్చిన ఫిర్యాదులు, తదితర అంశాల ద్వారా ఖాతాల గుర్తింపు
- దేశవ్యాప్తంగా 30 లక్షల ఖాతాలపై వాట్సాప్ కొరడా
- అంతర్జాతీయంగా నెలకు 80 లక్షల ఖాతాలు బ్యాన్!
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. భారతీయ వినియోగదారులపై కొరడా ఝుళిపిస్తోంది. ఈ సంస్థ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, గడిచిన 46 రోజుల వ్యవధిలో సుమారు 30 లక్షలమంది భారతీయ వాట్సాప్ ఖాతాలపై బ్యాన్ విధించినట్లు సంస్థ నివేదిక తెలిపింది. ఈ ఏడాది 16 జూన్ నుంచి 31 జులై వరకూ మొత్తం 30,27,000 భారతీయ వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో అసలు ఏ కారణాల వల్ల ఈ ఖాతాలు రద్దయ్యాయి? వాట్సాప్ ఇలాంటి ఖాతాలను ఎలా గుర్తిస్తుంది? అనే అంశాలను ఒకసారి పరిశీలిస్తే..
భారతీయ మొబైల్ నంబర్లన్నీ కూడా ( 91)తో ప్రారంభమవుతాయన్న సంగతి తెలిసిందే. ఇలానే భారతీయ ఖాతాలను వాట్సాప్ కూడా గుర్తిస్తుందట. తాజాగా వాట్సాప్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ కంపెనీకి జూన్ 16 నుంచి జులై 31 వరకూ మొత్తం 594 ఫిర్యాదులు వచ్చాయట. వీటిలో 74 ఖాతాలపై చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే అకౌంట్లు రద్దు చేయడం, లేదా రద్దయిన ఖాతాలను పునరుద్ధరించడం అన్నమాట.
అలాగే ఖాతా గురించి యూజర్లకు కావలసిన సహకారం అందించడం తదితర చర్యలన్నింటినీ ఈ నివేదికలో వాట్సాప్ వెల్లడించింది. తమకు వచ్చే ఫిర్యాదులతోపాటు ప్రొఫైల్ పొటోలు, గ్రూప్ ఫొటోలు, డిస్క్రిప్షన్ వంటి ఎన్‌క్రిప్ట్ కాని సమాచారాన్ని పరిశీలించి, అత్యాధునిక ఏఐ టూల్స్ వంటి వాటిని ఉపయోగించి చర్యలు తీసుకోవాల్సిన ఖాతాలను వాట్సాప్ గుర్తిస్తుందని ఈ నివేదిక చెబుతోంది. తమ యాప్‌ను మిస్‌యూజ్ చేసే ప్రమాదం ఉందని భావించే ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది.
మే 26 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబంధనల ప్రకారం, 50 లక్షలమంది కన్నా ఎక్కువ యూజర్లు ఉన్న డిజిటల్ వేదికలన్నీ ప్రతినెలా కంప్లియన్స్ నివేదికలను సమర్పించాలి. వీటిలో సంస్థకు వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలను కూడా పేర్కొనాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే నివేదిక విడుదల చేసిన వాట్సాప్.. అంతర్జాతీయంగా నెలకు 80 లక్షల యూజర్లను బ్యాన్ చేస్తున్నట్లు పేర్కొంది.