మైనర్‌ను బలవంతంగా పెళ్లి చేసుకొని, సన్నిహితంగా గడిపిన యువతి.. పోలీసు కేసు!
- తమిళనాడులో వెలుగు చూసిన ఘటన
- పొల్లాచ్చిలో పెట్రోలు బంకులో యువతి ఉద్యోగం
- 17ఏళ్ల యువకుడితో ప్రేమ
- గుడికి తీసుకెళ్లి బలవంతంగా తాళి కట్టించుకున్న వైనం
- యువకుడి తల్లి కేసు పెట్టడంతో యువతి అరెస్టు
తమిళనాడులోని పొల్లాచ్చిలో ఒక పెట్రోలు బంకులో 19 ఏళ్ల యువతి పని చేస్తోంది. అక్కడకు తరచూ పెట్రోల్ కోసం వచ్చే 17 ఏళ్ల స్టూడెంట్ తో ఆమెకు పరిచయమైంది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. కొంతకాలం క్రితం ఆ అబ్బాయి అనారోగ్యానికి గురయ్యాడు. అప్పుడు ఆ యువతి దగ్గరుండి అన్నీ చూసుకుంది. ఆ తర్వాత అతను డిశ్చార్జి అయ్యాడు. ఆ వెంటనే అతన్ని దగ్గరలోని గుడికి తీసుకెళ్లింది. తల్లిదండ్రులు తమను విడదీయకుండా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలని చెప్పి, అతనితో తాళి కట్టించుకుంది. ఆపై ఇద్దరూ కోయంబత్తూర్ వెళ్లి అక్కడే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు.
ఈ క్రమంలో యువకుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కోయంబత్తూర్ వెళ్లి ఆ జంటను పొల్లాచ్చికి తీసుకొచ్చారు. తన ప్రియురాలు గుడికి తీసుకెళ్లి బలవంతంగా తాళి కట్టించుకుందని ఆ యువకుడు చెప్పాడు. ఆ తర్వాత తనతో సన్నిహితంగా గడపడం ప్రారంభించిందని వివరించాడు. దీంతో ఆ యువతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న కేసులో యువతి అరెస్టు కావడం ఇదే తొలిసారని స్థానిక ఎస్పీ సెల్వనాగరత్నం చెప్పారు.