క్రెడిట్ కార్డు ఇవ్వం పొమ్మన్నారు... క్రెడిట్ కార్డులకు ప్రత్యామ్నాయంగా ఓ వ్యాపారాన్నే సృష్టించాడు!
- రస్సెల్ కమ్మర్ పట్టుదల
- గతంలో గోల్డ్ మన్ సాక్స్ లో ఉద్యోగం
- టోక్యోలో ఓ క్రెడిట్ కార్డు పొందలేని వైనం
- వినూత్న సిద్ధాంతంతో సొంత వ్యాపారం
- 1.2 బిలియన్ డాలర్లకు చేరిన వ్యాపారం
రస్సెల్ కమ్మర్... గతంలో అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్ మన్ సాక్స్ లో క్రెడిట్ విభాగంలో పనిచేసేవాడు. జపాన్ లో ఉన్న సమయంలో 41 ఏళ్ల రస్సెల్ కమ్మర్ ఓసారి చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. టోక్యో మహానగరంలో ఎంత ప్రయత్నించినా గానీ ఒక క్రెడిట్ కార్డును పొందలేకపోయాడు. క్రెడిట్ కార్డు సంస్థలు కమ్మర్ దరఖాస్తులను నిర్మొహమాటంగా తిరస్కరించాయి.
మరొకరైతే అంతటితో సరిపెట్టుకునేవారేమో కానీ, కమ్మర్ లో ఆ ఘటన తీవ్రమైన పట్టుదల రేకెత్తించింది. ఆ పంతం క్రెడిట్ కార్డు ఎలా సంపాదించాలా అని కాదు... క్రెడిట్ కార్డులకు ప్రత్యామ్నాయంగా ఏంచేస్తే బాగుంటుందో అనేదానిపై తీవ్రంగా ఆలోచించాడు. సీన్ కట్ చేస్తే... ఓ తిరుగులేని ప్రత్యామ్నాయ వ్యాపారాన్ని సృష్టించాడు.
సాధారణంగా క్రెడిట్ కార్డులతో ఎవరైనా షాపింగ్ చేస్తే, సంబంధిత బ్యాంకు నుంచి నగదు దుకాణదారులకు బదిలీ అవుతుంది. అంటే కరెన్సీ నోట్లతో పనిలేదు. మరి క్రెడిట్ కార్డులు లేని వారి పరిస్థితి..? అలాంటి వారి బిల్లులు తాము చెల్లిస్తామంటూ రస్సెల్ కమ్మర్ తన వ్యాపారానికి అంకుర్పారణ చేశాడు. 'పెయిడీ ఇన్ కార్పొరేటెడ్' (Paidy Inc) పేరిట ఓ ఆర్థిక సేవల సంస్థను స్థాపించాడు.
ఈ సంస్థ వినియోగదారులకు, దుకాణదారులకు మధ్యలో వారధిలా ఉంటుంది. వినియోగదారుల తరఫున బిల్లులు చెల్లించి, ఆ బిల్లులను తర్వాత వసూలు చేసుకుంటుంది. టూకీగా చెప్పాలంటే ముందు కొనుగోలు చేయి... ఆ తర్వాత చెల్లించు అనేది 'పెయిడీ' వ్యాపారసూత్రం. ఇప్పుడిది జపాన్ లో వేగంగా ప్రజాదరణ పొంది, స్టార్టప్ స్థాయి నుంచి దిగ్గజ కంపెనీ దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల అంచనాల ప్రకారం 'పెయిడీ' విలువ 1.2 బిలియన్ డాలర్లకు చేరింది.