గత 19 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దేశ రాజధానిలో వర్ష బీభత్సం
- ఒక్కరోజు వ్యవధిలో 100 మిమీ పైగా వర్షం
- ఇంకా వర్షాలు పడతాయన్న ఐఎండీ
- ఇప్పటికే నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
- చెరువుల్లా మారిన రహదారులు
దేశ రాజధాని ఢిల్లీని కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 19 ఏళ్లలో ఎన్నడూలేనంత వర్షపాతం ఢిల్లీలో నమోదైంది. వరుసగా రెండో రోజు కూడా అతి భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలమైంది. రోడ్లు జలాశయాలను తలపించాయి. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 వరకు 112.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సెప్టెంబరు మాసంలో ఇంత భారీ వర్షపాతం నమోదు కావడం గత 19 ఏళ్లలో ఇదే ప్రథమం.
ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నివాసాల్లోకి, షాపింగ్ మాల్స్ లోకి నీరు ప్రవేశించింది. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలో ఇంకా భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) హెచ్చరిస్తోంది. ప్రస్తుతానికి ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.