ఇడుపులపాయకు బయల్దేరిన వైఎస్ షర్మిల
- రేపు వైఎస్సార్ వర్ధంతి
- ఇడుపులపాయలో తండ్రికి నివాళి అర్పించనున్న షర్మిల
- వైఎస్సార్టీపీ కార్యాలయంలో పలు కార్యక్రమాలు
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయకు బయల్దేరారు. రేపు వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి. దీంతో, తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించేందుకు ఆమె ఇడుపులపాయకు వెళ్లారు. రేపు ఉదయం 7 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మతో కలిసి ఆమె నివాళి అర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ఆమె హైదరాబాద్ చేరుకుంటారు. రేపు సాయంత్రం హైదరాబాదులో విజయమ్మ నిర్వహించనున్న సంస్మరణ సభకు షర్మిల హాజరవుతారు. మరోవైపు వైఎస్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్టీపీ కార్యాలయంలో జాబ్ మేళా, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు.