హుజూరాబాద్ కు ఇక ఢోకా లేదు: హరీశ్ రావు

  • హుజూరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ
  • ఈటల రాజేందర్ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించలేదు
  • బండి సంజయ్ ఒక లక్ష రూపాయల పనైనా చేశారా?
హుజూరాబాద్ ఉపఎన్నిక రైతుబంధుకు, రైతు ద్రోహులకు మధ్య పోటీ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఉపఎన్నికలో పోటీ టీఆర్ఎస్, బీజేపీకి మధ్యేనని చెప్పారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని అన్నారు. హుజూరాబాద్ కు డబుల్ ధమాకా గెల్లు శ్రీనివాస్ ఎమ్మెల్యే, కౌశిక్ రెడ్డి అని చెప్పారు. హుజూరాబాద్ కు ఇక ఢోకా లేదని అన్నారు. పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు పెంచడం, మార్కెట్ యార్డుల రద్దు వంటివి బీజీపీ పని అని విమర్శించారు. ఆందోళన చేస్తున్న రైతులపై రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయుగోళాలతో దాడి చేస్తున్నారని చెప్పారు.
 
అందరు మంత్రులు వారి నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి, లబ్దిదారులను ఇళ్లలోకి పంపారని... ఈటల రాజేందర్ మాత్రం ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని... అలాంటి ఈటలను గెలిపించడం అవసరమా? అని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత ఒక లక్ష రూపాయల పనైనా చేశారా? అని ఎద్దేవా చేశారు.


More Telugu News