ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అనడం దారుణం: రఘురామ

  • సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అన్న మంత్రి గౌతమ్ రెడ్డి
  • మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టిన రఘురామ
  • ఏపీ రాజధాని అమరావతేనని ఉద్ఘాటన
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాజధాని అంశంలో చేసిన వ్యాఖ్యలను నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అవుతుందా? ఇది దారుణమని అభిప్రాయపడ్డారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఉండే రాజధానికి విలువ లేదా? అని ప్రశ్నించారు. జగన్ సర్కారులో మంత్రులకు విలువ లేదా? అని నిలదీశారు.

మంత్రి గౌతమ్ రెడ్డి నిన్న వ్యాఖ్యానిస్తూ, సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అనుకోవాలని పేర్కొన్నారు. అది పులివెందుల కానీ, విజయవాడ కానీ, మరేదైనా కానీ... సీఎం నివాసం ఎక్కడుంటే అదే సెక్రటేరియట్, అదే రాజధాని అని భాష్యం చెప్పారు. శ్రీభాగ్ ఒప్పందాన్ని అనుసరించే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, సీఎం నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని మేకపాటి స్పష్టం చేశారు.

దీనిపై రఘురామ ఘాటుగా స్పందించారు. "సీఎం సిమ్లా వెళితే సిమ్లా రాజధాని కాదు, సీఎం జెరూసలెం వెళితే జెరూసలెం రాజధాని కాదు, బెత్లెహాం వెళితే బెత్లెహాం రాజధాని కాదు. ఏపీ రాజధాని అమరావతి అని చట్టసభలో తీర్మానించారు. అదే రాజధాని అవుతుంది" అని ఉద్ఘాటించారు.


More Telugu News