జీవో 217 ప్రతులను తగలబెట్టిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
- జీవో 217 నేపథ్యంలో ధ్వజమెత్తిన రవీంద్ర
- మత్స్యకారుల పొట్ట కొట్టే విధంగా ఉందని విమర్శలు
- మత్స్యకారులను నిలువునా ముంచుతున్నారని వ్యాఖ్యలు
- జీవో రద్దు చేయాలని డిమాండ్
సీఎం జగన్ తీసుకువచ్చిన జీవో 217 మత్స్యకారుల పొట్ట కొట్టే విధంగా ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన జీవో 217 ప్రతులను దహనం చేశారు. అనంతరం మాట్లాడుతూ, సీఎం జగన్ మత్స్యకారులను నిలువునా నీటిలో ముంచుతున్నారని విమర్శించారు. ఈ జీవో ద్వారా మత్స్యకార సొసైటీ హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. చెరువులకు ఆన్ లైన్ లో టెండర్ ప్రక్రియ అంటూ మత్స్యకారుల గొంతు కోస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
మంత్రి అప్పలరాజు తన పదవిని కాపాడుకోవడం కోసం మత్స్యకారులకు అన్యాయం జరుగుతున్నా చూస్తూ కూర్చున్నారని ఆరోపించారు. ప్రభుత్వం జీవో 217ని రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.