ఇండియాలో మరోసారి 40 వేలు దాటిన కరోనా కేసులు
- 24 గంటల్లో 41,965 కేసుల నమోదు
- దేశ వ్యాప్తంగా 460 మంది మృతి
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,78,181
ఇండియాలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. దేశ వ్యాప్తంగా మరోసారి కేసుల సంఖ్య 40 వేలు దాటింది. మొత్తం 41,965 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 33,964 మంది కోలుకోగా... 460 మంది మృతి చెందారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,28,10,845కి పెరిగింది. మొత్తం 3,19,93,644 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,39,020 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 3,78,181 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 65,41,13,508 డోసుల వ్యాక్సిన్ వేశారు. గత 24 గంటల్లో 1,33,18,718 టీకాలు వేశారు. మన దేశంలో అధిక కేసులు కేరళలో నమోదవుతున్నాయి.