జైల్లోనే ఆయుర్వేద చికిత్స చేయిస్తాం... ఆశారాం బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
- ఆయుర్వేద చికిత్స కోసం బెయిల్ అడిగిన బాబా ఆశారాం
- అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న రాజస్థాన్ బాబా
- ఈ వంకతో శిక్ష నుంచి తప్పించుకునే యత్నమన్న ప్రభుత్వం
- ఆశారాం చేసిన నేరం చిన్నదేమీ కాదన్న సుప్రీం
రాజస్థాన్‌కు చెందిన బాబాజీ ఆశారాం.. మధ్యంతర బెయిలు కోసం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తన ఆరోగ్యం బాగోలేదని, ఆయుర్వేద చికిత్స చేయించుకోవాలని ఆశారాం తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. అందుకే తనకు బెయిలు కావాలని కోరాడు.
తన ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఆశారాంను 2018లో జోధ్‌పూర్‌కు చెందిన కోర్టు దోషిగా తేల్చి, జీవితఖైదు విధించింది. ఈ నేపథ్యంలో ఆశారాం బెయిల్ పిటిషన్‌కు వ్యతిరేకంగా వాదించిన రాజస్థాన్ ప్రభుత్వం.. తన జైలు శిక్షను రద్దు చేయించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బెయిల్ పిటిషన్ వేశారని ఆరోపించింది.
2014, 2016 సంవత్సరాల్లో కూడా ఆశారాం ఇలాంటి తరహా పిటిషన్లే వేసిన అంశాన్ని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం గుర్తుచేసింది. ఆ సమయంలో అత్యున్నత న్యాయస్థానం నియమించిన వైద్యుల కమిటీ అతనికి పరీక్షలు చేసి, ఆశారాంకు ఎటువంటి సమస్యలూ లేవని తేల్చిందని తెలిపింది. ఈ వాదనలన్నీ విన్న సుప్రీంకోర్టు.. ఆశారాం చేసిన నేరం చిన్నదేమీ కాదని వ్యాఖ్యానించింది. ‘‘మీకు కావలసిన ఆయుర్వేద చికిత్స మొత్తం జైల్లోనే చేయిస్తాం’’ అని పేర్కొంటూ బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది.