మళ్లీ మారేడుమిల్లి ఫారెస్టుకు 'పుష్ప'

  • అడవి నేపథ్యంలో సాగే కథ
  • సెప్టెంబర్ 2 నుంచి చివరి షెడ్యూల్
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న విలన్ లుక్
  • క్రిస్మస్ కి భారీస్థాయి విడుదల
'పుష్ప' కథ అంతా కూడా అడవి నేపథ్యంలోనే నడుస్తుంది. అందువలన ఈ సినిమాకి సంబంధించిన షూటింగు ఎక్కువగా మారేడుమిల్లి .. రంపచోడవరం అటవీప్రాంతాల్లో జరిగింది. గతంలో అక్కడ కొంతకాలం పాటు ఉండి షూటింగు చేసుకొచ్చారు. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా టీమ్ మారేడుమిల్లి బాటపట్టింది.

కొన్ని రోజుల క్రితం వరకూ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను హైదారాబాద్ లోనే చిత్రీకరించారు. ఆ షెడ్యూల్ పూర్తికావడంతో, ముందుగా అనుకున్న ప్రకారమే మారేడుమిల్లికి ప్రయాణం కట్టారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి చివరి షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. ఏకధాటిగా జరిగే ఈ షెడ్యూల్ తో షూటింగు పార్టు పూర్తవుతుందని చెబుతున్నారు.

అక్టోబర్ నాటికి అన్ని పనులను పూర్తిచేసి, 'క్రిస్మస్'కి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. ఇటీవల వదిలిన ఆయన ఫస్టులుక్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది.


More Telugu News