పాఠశాలల స్థలాల్లో ప్రభుత్వ భవనాలను 4 వారాల్లో తొలగించాలి: ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

  • పాఠశాలల స్థలాల్లో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు
  • పిటిషన్లపై నేడు విచారణ
  • 450 నిర్మాణాలను తరలించామన్న ప్రభుత్వం
  • తదుపరి విచారణ అక్టోబరు 1కి వాయిదా
పాఠశాలలకు చెందిన స్థలాల్లో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ/వార్డు సచివాలయాలు నిర్మించడంపై దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు నేడు విచారించింది. నేటి విచారణకు ఏడుగురు ఐఏఎస్ అధికారులు కూడా హాజరయ్యారు. విచారణ సందర్భంగా... రాష్ట్రంలో 1,160 చోట్ల రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు నిర్మించినట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 450 నిర్మాణాలను మరో చోటుకు తరలించినట్టు వివరించింది. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, మిగతా నిర్మాణాలను 4 వారాల్లో తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 1కి వాయిదా వేసింది.


More Telugu News