కరోనా థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయి: ఐసీఎంఆర్
- సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా లేని రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి
- ఈ ట్రెండ్ థర్డ్ వేవ్ సంకేతాలను చూపుతోంది
- మూడో వేవ్ కు అందరూ సిద్ధం కావాలి
కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందనే అనుమానాలు నానాటికీ బలపడుతున్నాయి. తాజాగా ఐసీఎంఆర్ కు చెందిన అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ సమిరన్ పాండా మాట్లాడుతూ, థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు. సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా లేని రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయని... ఈ ట్రెండ్ థర్డ్ వేవ్ సంకేతాలను చూపుతోందని హెచ్చరించారు.
సెకండ్ వేవ్ సమయంలో అనేక రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయని... వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయని.. అందువల్ల సెకండ్ వేవ్ అంత తీవ్రతను చూపలేదని చెప్పారు. ఇప్పుడు అందరూ మూడో వేవ్ కు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.