ముగిసిన ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం... అచ్చెన్నాయుడికి మరో చాన్స్!
- కాకాణి గోవర్ధన్ అధ్యక్షతన ప్రివిలేజ్ కమిటీ భేటీ
- వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉన్న అచ్చెన్న, కూన
- రాలేనని సమాచారం ఇచ్చిన అచ్చెన్న
- వచ్చే నెల 14న రావాలంటూ ఆదేశించిన కమిటీ
- డుమ్మా కొట్టిన కూనపై కమిటీ ఆగ్రహం
ఏపీ అసెంబ్లీలో నిర్వహించిన ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీ.... టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ లపై వచ్చిన ఫిర్యాదులే ప్రధాన అజెండాగా సాగింది.
కాగా ఈ సమావేశానికి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంది. అయితే, తనకు అత్యవసర పనులు ఉండడం వల్ల రాలేకపోతున్నానని అచ్చెన్నాయుడు ప్రివిలేజ్ కమిటీకి ముందుగానే సమాచారం అందించారు. దాంతో, సెప్టెంబరు 14న జరిగే సమావేశానికి తప్పనిసరిగా రావాలని అచ్చెన్నను ప్రివిలేజ్ కమిటీ ఆదేశించింది.
ఇక, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేటి సమావేశానికి డుమ్మాకొట్టిన కూన రవికుమార్ పై కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యను ధిక్కారంగా భావిస్తున్నట్టు పేర్కొంది. రవికుమార్ పై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్తు తెలిపింది.