దురాక్రమణకు యత్నించిన తాలిబన్లకు దీటుగా బదులిచ్చిన పంజ్ షీర్ యోధులు
- మరోసారి దాడికి దిగిన తాలిబన్లు
- లొంగేదిలేదంటున్న పంజ్ షీర్ లోయ
- తాలిబన్లను ఎదుర్కొన్న ప్రతిఘటన దళాలు
- 8 మంది తాలిబన్ల మృతి
రాజధాని కాబూల్ సహా ఆఫ్ఘనిస్థాన్ ను దాదాపు ఆక్రమించిన తాలిబన్లకు పంజ్ షీర్ లోయ మాత్రం కొరకరానికొయ్యలా పరిణమించింది. గతరాత్రి పంజ్ షీర్ లోయపైకి దండెత్తిన తాలిబన్లను స్థానిక ప్రతిఘటన దళాలు హడలెత్తించాయి. భారీ ఆయుధ సంపత్తితో వచ్చిన తాలిబన్లు ఓ అవుట్ పోస్టుపై దాడికి యత్నించగా, ప్రతిఘటన దళాలు దీటుగా బదులిచ్చాయి.
ఈ పోరాటంలో 8 మంది వరకు తాలిబన్లు హతమయ్యారని పంజ్ షీర్ దళాలకు చెందిన ఫహీమ్ దాష్తి వెల్లడించారు. తాలిబన్ల దాడిని తిప్పికొట్టామని, ఈ దాడిలో పలువురు ప్రజలతో పాటు ఇద్దరు ప్రతిఘటన దళ సభ్యులు కూడా గాయపడ్డారని దాష్తి వివరించారు. కాగా, ఈ ఘటనపై తాలిబన్లు ఇప్పటివరకు స్పందించలేదు.