ఆఫ్ఘనిస్థాన్​ నుంచి అమెరికా తరలించిన చివరి వ్యక్తి ఇతనే!

  • మేజర్ జనరల్ క్రిస్ దొనాహువేనే చివరివ్యక్తి
  • సీ17 విమానంలో తీసుకెళ్లామన్న అమెరికా
  • నైట్ విజన్ గ్లాసెస్ తో తీసిన ఫొటో పోస్ట్
ఆఫ్ఘనిస్థాన్ లో 20 ఏళ్ల పాటు కొనసాగిన అమెరికా పట్టు.. ఇవాళ్టితో ముగిసిపోయింది. సైన్యం మొత్తాన్ని వెనక్కు తీసుకెళ్లిపోయింది. పెట్టుకున్న గడువులోపే ఉపసంహరణను పూర్తి చేసింది. మరి, ఆ ఉపసంహరణలో భాగంగా అగ్రరాజ్యం తరలించిన చిట్టచివరి వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నకూ అమెరికా సమాధానం చెప్పేసింది.

తాము తరలించిన చిట్టచివరి అమెరికా వ్యక్తి 82వ ఎయిర్ బార్న్ డివిజన్ కమాండర్ జనరల్ క్రిస్ దొనాహువే అని వెల్లడించింది. నైట్ విజన్ గ్లాసెస్ తో క్లిక్ మనిపించిన ఫొటోను విదేశాంగ శాఖ పోస్ట్ చేసింది. సీ17 విమానంలో అతడిని కాబూల్ నుంచి అమెరికాకు తీసుకొచ్చేసినట్టు పేర్కొంది. కాగా, ఆగస్టు 14 నుంచి ఇప్పటిదాకా అమెరికా 1.22 లక్షల మందిని బయటికి తరలించినట్టు అంచనా.


More Telugu News