ఆస్ట్రేలియాలో బాగానే ఆడే కోహ్లీ.. ఈ దేశాల్లో ఇబ్బంది పడుతున్నాడు: ఆకిబ్ జావెద్

  • ఇంగ్లండ్ సిరీస్ లో ఇబ్బంది పడుతున్న కోహ్లీ
  • ఔట్ స్వింగర్లను ఆడబోయి ఔట్ అవుతున్నాడన్న జావెద్
  • జో రూట్ బాగా ఆడుతున్నాడని కితాబు
ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తడబాటుకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ... 24.80 సగటులో కేవలం 124 పరుగులు మాత్రమే సాధించాడు. మరోవైపు కోహ్లీ సెంచరీ చేసి రెండేళ్లు కావొస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ బ్యాటింగ్ పై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ జావెద్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లీ గొప్ప బ్యాట్స్ మెన్ అని, ఆసియాలో విలక్షణమైన ఆటగాడని జావెద్ కితాబునిచ్చాడు. ఆస్ట్రేలియాపై కూడా బాగా ఆడే కోహ్లీ... ఇంగ్లండ్, సౌతాఫ్రికా దేశాల్లో బంతికి స్వింగ్ లేదా సీమ్ లభించినప్పుడు ఇబ్బంది పడుతున్నాడని చెప్పాడు. అవుట్ స్వింగర్లను ఆడబోయి ఔట్ అవుతున్నాడని తెలిపాడు. ఇంగ్లండ్ పిచ్ లపై ఆ దేశ కెప్టెన్ జో రూట్ బాగా ఆడుతున్నాడని కితాబునిచ్చాడు. ఇంగ్లండ్ లోని కఠినమైన పిచ్ లపై బంతిని ఆలస్యంగా ఎలా ఆడాలనే టెక్నిక్ రూట్ కు తెలుసని... అదే అతన్ని కాపాడుతోందని చెప్పాడు.


More Telugu News