చారిత్రక ఘట్టం.. సుప్రీంకోర్టు నూతన న్యాయ‌మూర్తులుగా ఒకేసారి 9 మంది ప్ర‌మాణ స్వీకారం

  • ఇటీవలే కేంద్ర స‌ర్కారు గెజిట్ విడుద‌ల‌
  • 9 మంది జ‌డ్జిల‌తో ప్ర‌మాణం చేయించిన సీజేఐ
  • జస్టిస్‌ హిమా కోహ్లీ కూడా ప్ర‌మాణ స్వీకారం
సుప్రీంకోర్టుకు నూత‌నంగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులతో  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవలే సుప్రీంకోర్టుకు కొత్తగా న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర స‌ర్కారు గెజిట్‌ విడుదల చేసిన విష‌యం తెలిసిందే.  

ఈ నేప‌థ్యంలోనే జడ్జిలుగా జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బీవీ నాగరత్నం, జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రవికుమార్‌, జస్టిస్ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ సుందరేశ్‌, జస్టిస్‌ ఏఎస్ ఓకా, జస్టిస్‌ విక్రమ్‌నాథ్ ప్ర‌మాణ స్వీకారం చేశారు.

దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. జస్టిస్‌ హిమా కోహ్లీ ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన విషయం తెలిసిందే. కాగా, సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి తొమ్మిది మంది ఎప్పుడూ ప్రమాణస్వీకారం చేయలేదు. ఇదో చారిత్ర‌క ఘ‌ట్టంగా చెప్పుకోవ‌చ్చు.


More Telugu News