హుజూరాబాద్ ఎన్నికల బరిలోకి వెయ్యి మంది మాజీ ఫీల్డ్ అసిస్టెంట్లు.. టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యం అని ప్రకటన!
- రసవత్తరంగా మారుతున్న హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు
- తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారని మండిపాటు
- టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ప్రకటన
హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారబోతోంది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ కొండా సురేఖను బరిలోకి దింపబోతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఫీల్డ్ అసిస్టెంట్లు షాక్ ఇవ్వబోతున్నారు. వెయ్యి మంది మాజీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 16 ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లుగా పని చేసిన తమను టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే తాము ఎన్నికల బరిలోకి దిగుతున్నామని... హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. తక్షణమే తాము ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నామని... టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని తెలిపారు.