టీవీఎస్ నుంచి కొత్త అపాచీ... ధర మామూలుగా లేదు!
- అపాచీ ఆర్ఆర్310 తీసుకువచ్చిన టీవీఎస్
- డైనమిక్, రేసింగ్ అవుట్ ఫిట్లతో కొత్త బైక్
- వినియోగదారులు కోరుకుంటే బైక్ లో మార్పులు
- ప్రారంభ ధర రూ.2.59 లక్షలు
దేశీయ ద్విచక్రవాహన తయారీ సంస్థ టీవీఎస్ తన అపాచీ పోర్ట్ ఫోలియోకు కొత్త మోడల్ ను జతచేసింది. తాజాగా అపాచీ ఆర్ఆర్310 మోడల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. 2017లో అపాచీ మోడల్ ను తీసుకువచ్చిన టీవీఎస్ క్రమం తప్పకుండా అప్ డేట్లతో కొత్త వెర్షన్లు తీసుకువస్తోంది. ఈసారి తీసుకువచ్చిన అపాచీ ఆర్ఆర్310లో డైనమిక్, రేసింగ్ అవుట్ ఫిట్లు యువతను ఆకట్టుకుంటాయని కంపెనీ భావిస్తోంది.
ఈ ఆర్ఆర్310 మోడల్ ను కోరుకునే కస్టమర్లకు 'బిల్ట్ టు ఆర్డర్' పేరిట టీవీఎస్ వినూత్న సదుపాయం కల్పిస్తోంది. ఈ బైక్ ను బుక్ చేసుకునే సమయంలో వినియోగదారులు తమకు ఎలాంటి సౌకర్యాలు, ఫీచర్లు ఉండాలో చెబితే, వారి అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా టీవీఎస్ తన కొత్త అపాచీలను ఉత్పత్తి చేయనుంది. అందుకోసం కొత్త TVS ARIVE యాప్ ను కూడా తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా కస్టమర్లు తమ బైక్ కు మార్పులు, చేర్పులు సూచించవచ్చు.
కాగా, ఈ విధానంలో టీవీఎస్ నెలకు 150 కస్టమైజ్డ్ బైకులను మాత్రమే అందించనుంది. తొలి రెండు నెలల తర్వాత నెలకు 100 బైకులను మాత్రమే సరఫరా చేస్తామని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఇక బైక్ టెక్నికల్ అంశాలు చూస్తే, ఇందులో 6 గేర్లు ఉంటాయి. రేస్ ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్ ఈ బైక్ ప్రత్యేకత అని చెప్పాలి. బ్లూటూత్ కనెక్టివిటీ పొందుపరిచారు. ఈ బైక్ లో అర్బన్, ట్రాక్, స్పోర్ట్, రెయిన్ పేరిట నాలుగు రైడింగ్ మోడ్లు ఇచ్చారు. ఈ బైక్ ప్రారంభ వేరియంట్ ధర రూ.2.59 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూం). వినియోగదారులు కోరుకునే సదుపాయాలను బట్టి ధర మారుతూ ఉంటుంది.