అల్పపీడనానికి తోడు మరో ఉపరితల ఆవర్తనం... ఏపీలో పలు జిల్లాలకు వర్షసూచన

  • దక్షిణ చత్తీస్ గఢ్ పై అల్పపీడనం
  • తాజాగా సముద్రమట్టానికి 4.5 కిమీ ఎత్తున ఆవర్తనం
  • ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం
  • రాయలసీమలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు
ప్రస్తుతం దక్షిణ చత్తీస్ గఢ్ పై అల్పపీడనం ఆవరించి ఉండగా, దానికి జతగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తున ఉందని వివరించింది. మరోవైపు బికనీర్, అజ్మీర్ నుంచి చత్తీస్ గఢ్ మీదుగా విశాఖ వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోందని తెలిపింది.

ఈ వాతావరణ మార్పుల కారణంగా ఏపీలో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలలో ఆకాశం మేఘావృతమై ఉందని పేర్కొంది. చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని, ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో కర్నూలు, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.


More Telugu News