భారత అథ్లెట్ వినోద్ కుమార్ నుంచి పతకం వెనక్కి తీసుకున్న టోక్యో పారాలింపిక్స్ కమిటీ
- టోక్యో పారాలింపిక్స్ లో అనూహ్య పరిణామం
- వినోద్ కుమార్ అనర్హుడన్న కాంపిటీషన్ ప్యానెల్
- అతడి వైకల్యంపై స్పష్టత లేదని వెల్లడి
- ఎఫ్52 కేటగిరీలో అనుమతించలేమని వివరణ
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు నిరాశాజనక పరిణామం ఎదురైంది. డిస్కస్ త్రో క్రీడాంశంలో కాంస్యం గెలిచిన వినోద్ కుమార్ పై పారాలింపిక్స్ నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. అతడి నుంచి పతకం వెనక్కి తీసుకున్నారు. వినోద్ కుమార్ ఏ విధమైన అంగ వైక్యలం కలిగి ఉన్నాడన్న దానిపై స్పష్టత లేకపోవడంతో పారాలింపిక్స్ కాంపిటీషన్ ప్యానెల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
41 ఏళ్ల వినోద్ కుమార్ డిస్కస్ త్రో ఫైనల్ ఈవెంట్ లో 19.91 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. అయితే ఈ ఫలితాన్ని కొందరు పోటీదారులు కాంపిటీషన్ ప్యానెల్ వద్ద సవాల్ చేశారు. దాంతో విచారణ జరిపిన ప్యానెల్... వినోద్ కుమార్ ఏ విధమైన వైకల్యం కలిగి ఉన్నాడో గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందని, అతడిని ఎఫ్52 కేటగిరీలో పోటీపడేందుకు అర్హుడిగా భావించలేమని వెల్లడించింది.
కొన్ని ప్రత్యేకమైన వైకల్యాలు కలిగివున్న వారిని ఎఫ్52 కేటగిరీలో పోటీపడేందుకు అనుమతిస్తారు. అయితే, ఎఫ్52 కేటగిరీలో పేర్కొన్న వైకల్యాల్లో దేన్ని వినోద్ కుమార్ కలిగివున్నాడో వర్గీకరించే ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని ప్యానెల్ అభిప్రాయపడింది. దాంతో ఈ కేటగిరీలో వినోద్ కుమార్ కు లభించిన మూడోస్థానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.