మంత్రి బొత్స వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవద్దు: రఘురామకృష్ణ రాజు
- కర్నూలులో హైకోర్టు పెట్టేపరిస్థితులు ఉన్నాయా?
- కరోనా కేసుల సంఖ్య కంటే ప్రభుత్వంపైనే ఎక్కువ కేసుల నమోదు
- అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకేచోట ఉండాలని ప్రజలు భావిస్తారు
- అవగాహన లేకుండా రాజధానులపై వ్యాఖ్యలు చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఎంపీ రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు. కర్నూలులో హైకోర్టు పెట్టేపరిస్థితులు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. కరోనా కేసుల సంఖ్య కంటే ప్రభుత్వంపైనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని చెప్పారు. అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకేచోట ఉండాలని ప్రజలు భావిస్తారని ఆయన తెలిపారు.
కర్నూలులో హైకోర్టు పెడితే అధికారులే అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉంటుందని రఘురామ కృష్ణరాజు చెప్పారు. అవగాహన లేకుండా రాజధానులపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన మాటలను ఎవరూ పట్టించుకోవద్దని రఘురామ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.