వివాహవేదికపై పెళ్లి కూతురు, పెళ్లికొడుకు పుష‌ప్స్‌.. అల‌రిస్తోన్న వీడియో!

  • హ‌ర్యానాలోని మానెస‌ర్ గ్రామంలో ఘ‌ట‌న‌
  • అక్షిత అరోరా, ఆదిత్య మ‌హాజ‌న్ కు పెళ్లి
  • వ‌ధూవ‌రుల‌ ఫిట్‌నెస్ గోల్స్ పేరిట వీడియో వైర‌ల్
వ‌ధూవ‌రులు పెళ్లి దుస్తుల్లో వినూత్నంగా ఏది చేసినా ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైర‌ల్ అవుతుంటాయి. ఇటీవ‌లే బుల్లెట్ బండి పాట‌కి వ‌ధూవ‌రులు చేసిన‌ డ్యాన్స్ బాగా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రో జంట పెళ్లి దుస్తుల్లో చేసిన ఓ వినూత్న ప్ర‌య‌త్నం వైర‌ల్ అవుతోంది. హ‌ర్యానాలోని మానెస‌ర్ గ్రామంలో అక్షిత అరోరా, ఆదిత్య మ‌హాజ‌న్ కు రెండు రోజుల క్రితం పెళ్లి జ‌రిగింది. వారిద్ద‌రికీ ఫిట్‌నెస్‌పై శ్ర‌ద్ధ ఎక్కువ‌.

దానిపై త‌మ‌కున్న ప్రేమ‌ను అంద‌రి ముందూ ప్ర‌ద‌ర్శించాల‌ని అనుకున్నారు. పెళ్లి ద‌స్తుల‌తోనే వేదిక‌పై పుష‌ప్స్ చేసి అద‌ర‌గొట్టారు. ఆ స‌మ‌యంలో వ‌ధువు న‌గ‌ల‌ను కూడా ధ‌రించి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోను కొంద‌రు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

వ‌ధూవ‌రుల‌ ఫిట్‌నెస్ గోల్స్ పేరిట ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. ల‌క్ష‌లాది మంది ఈ వీడియో చూశారు. ఆ కొత్త దంప‌తుల‌కు హ్యాట్సాఫ్ అంటూ ప‌లువురు రిప్లై ఇచ్చారు. ఫిట్‌నెస్ పై అంద‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించేలా ఈ వీడియో ఉంద‌ని కొంద‌రు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

         


More Telugu News