అవినీతిని ప్రశ్నించే ఆవేశపరుడే 'సామాన్యుడు'

  • విశాల్ నుంచి మరో యాక్షన్ మూవీ
  • తెలుగు టైటిల్ గా 'సామాన్యుడు' ఖరారు 
  • కథానాయికగా డింపుల్ హయతి 
  • త్వరలో థియేటర్లలో విడుదల
విశాల్ హీరోగా తమిళంలో ఒక సినిమా రూపొందింది. తెలుగులో ఈ సినిమాకి 'సామాన్యుడు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. నిన్న విశాల్ పుట్టినరోజు కావడంతో, ఈ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. తనని చుట్టుముట్టిన శత్రువులను మట్టుబెట్టినవాడిగా విశాల్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు.

విశాల్ సొంత బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను నిర్మించారు. శరవణన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. తన కళ్ల ముందు ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా సహించలేని ఒక ఆవేశపరుడి కథ ఇది. యాక్షన్ తో పాటు ఎమోషన్ పుష్కలంగా ఉన్న కథ ఇది.

ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు. విశాల్ జోడీగా 'డింపుల్ హయతి' నటించింది. ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. తమిళంతో పాటు తెలుగులోను ఒకే రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


More Telugu News