16 ఏళ్ల బాలుడికి కరోనా టీకా.. తీవ్ర అస్వస్థత

  • మధ్యప్రదేశ్‌లోని మెరెనా జిల్లాలో ఘటన
  • తలతిరుగుడు.. నోటి నుంచి నురగ
  • గ్వాలియర్ తరలించాలని సూచించిన వైద్యులు
  • బాలుడికి టీకా ఎలా ఇచ్చారనేదానిపై దర్యాప్తు
కరోనా టీకా తీసుకున్న 16 ఏళ్ల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన మధ్యప్రదేశ్‌లోని మెరెనా జిల్లాలో చోటుచేసుకుంది. అంబా తాలూకాలోని బాగ్‌కాపూర్‌కు చెందిన కమలేశ్ కుష్వాహా కుమారుడు పిల్లూకు శనివారం ఓ కేంద్రంలో టీకా వేశారు. ఆ వెంటనే బాలుడికి తలతిరుగుతున్నట్టు అనిపించి నోటి నుంచి నురగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన వైద్యులు చికిత్స కోసం అతడిని గ్వాలియర్ తరలించాల్సిందిగా సూచించారు.

బాలుడు అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. బాలుడిని గ్వాలియర్ తీసుకెళ్లారా? లేదా? అన్న విషయం తెలియరాలేదు. మరోవైపు, ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారికే టీకాలు వేస్తుండగా, ఆ వయసు లోపు వారికి ఇప్పటి వరకు టీకా అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ బాలుడికి టీకా ఎలా వేశారన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నట్టు జిల్లా ముఖ్య వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఏడీ శర్మ తెలిపారు.


More Telugu News