శ్మశానంలో చదువు.. శవాల పక్కనే ఆన్‌లైన్ క్లాసులు
- మొన్న కర్ణాటక.. ఇప్పుడు తెలంగాణ
- కొవిడ్ దెబ్బకు అంధకారంలో విద్యార్థుల భవిష్యత్తు
- పల్లెల్లో పరిస్థితి మరింత దయనీయం
- కల్పన పరిస్థితే నిలువెత్తు నిదర్శనం
కొవిడ్ మహమ్మారి కోట్ల జీవితాలను అంధకారం చేసింది. లక్షల కుటుంబాలను రోడ్డున పడేసింది. ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి చిన్నారుల చదువునూ దెబ్బతీసి.. వారి భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చింది. కొవిడ్‌ను నియంత్రించేందుకు 2020 మార్చిలో లాక్‌డౌన్ విధించిన సమయం నుంచి పాఠశాలలకు తాళాలు పడ్డాయి. విద్యార్థులు పూర్తిగా విద్యకు దూరమైపోయారు. అయితే ఈ పరిస్థితుల్లో చదువులు కుంటుపడకూడదనే ఉద్దేశంతో కొంతకాలం తరువాత ఆన్‌లైన్ క్లాసులు మొదలయ్యాయి. ఇది పట్టణాలు, నగరాల్లో బాగానే పనిచేస్తోంది. అక్కడి విద్యార్థులు ఇళ్లనుంచే టెక్నాలజీ సాయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాజరువుతున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల పరిస్థితే ఇప్పుడు దయనీయంగా ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు ఇంటర్నెట్ సిగ్నల్స్ లేకపోవడం, విద్యుత్ కోతలు. గతంలో కర్ణాటకలోని ఓ గ్రామంలో సిగ్నల్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు కొండ ప్రాంతానికి వెళ్లి ఆన్‌లైన్ కాసులకు హాజరైన విషయం గత నెలలో బయట పడిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
ఇక తాజాగా ఈ జాబితాలో తెలంగాణ కూడా చేరింది. జగిత్యాల జిల్లాలో ల్యాల మండలం, సర్వాపూర్‌కు చెందిన మిర్యాల కల్పన అనే వైద్య విద్యార్థిని ఏకంగా శ్మశానంలో విద్యాభ్యాసం చేస్తోంది. 2017లో ఎంసెట్ పరీక్ష రాసిన కల్పన.. ఆల్ ఇండియా 698 ర్యాంకు సాధించింది. ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో చేరింది. అయితే కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఇంట్లోనే ఉంటోంది. అక్కడి నుంచే ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతోంది. స్వగ్రామంలో ఇంటర్నెట్ సిగ్నల్స్ అందకపోవడంతో సమీపంలోని శ్మశానానికి వెళ్లి ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతోంది. శ్మశానంలో ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్న కల్పనకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
దీనిపై కల్పన మాట్లాడుతూ.. తనకు కుటుంబసభ్యులు సహకారం ఇస్తున్నారని..అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఆన్ లైన్ క్లాసుల కోసం ఇబ్బంది పడుతున్న తనలాంటి వారి కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని.. సిగ్నల్స్ వచ్చేలా చేయాలని కోరుతోంది.