కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ఆత్మాహుతి దళ సభ్యుడి వాహనాన్ని గురిచూసి పేల్చేసిన అమెరికా
- ఆఫ్ఘన్ నుంచి నిష్క్రమిస్తున్న అమెరికా బలగాలు
- అమెరికా బలగాలను టార్గెట్ చేసిన ఐసిస్
- కాబూల్ వద్ద దాడికి విఫలయత్నం
- వివరాలు తెలిపిన తాలిబన్ ప్రతినిధి
ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఈ నెల 31లోగా నిష్క్రమించేందుకు అమెరికా వేగంగా చర్యలు తీసుకుంటుండగా, ఇదే అదనుగా ఐసిస్-కె హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ భయాందోళనలు కలిగిస్తోంది. తాజాగా, కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ఆత్మాహుతి దాడిని అమెరికా ముందే అడ్డుకుంది. ఆత్మాహుతి దళ సభ్యుడున్న వాహనాన్ని అత్యాధునిక డ్రోన్ సాయంతో గురి తప్పకుండా పేల్చేసింది. ఈ మేరకు తాలిబన్లు వెల్లడించారు.
ప్రస్తుతం తాలిబన్లు కాబూల్ లోని హమీద్ కర్జాయ్ ఎయిర్ పోర్టు వద్ద భద్రతా బాధ్యతలు తీసుకున్నారు. తాజా ఘటనపై తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పందిస్తూ, తరలి వెళుతున్న అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి యత్నించగా, అమెరికా దళాలు ఆ ప్రయత్నాన్ని వమ్ము చేశాయని వెల్లడించారు.