శ్రీరాముడు లేకుండా అయోధ్య లేదు: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
- అయోధ్యలో రామ్ నాథ్ కోవింద్ పర్యటన
- రామాయణ సదస్సు ప్రారంభం
- తన పేరులోనూ రాముడున్నాడన్న రాష్ట్రపతి
- అయోధ్యకు అర్థం చెప్పిన వైనం
శ్రీరాముడు లేకుండా అయోధ్య లేదని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. అయోధ్యలో నేడు కోవింద్ పర్యటించారు. ప్రస్తుతం అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "రాముడు లేని అయోధ్యను అయోధ్యగా భావించలేం. ఆ రఘురాముడితో కూడుకున్నదే అయోధ్య. ఈ నగరంలో రాముడు శాశ్వతంగా కొలువు ఉంటాడు. అయోధ్యకు సంబంధించినంత వరకు ఇది వాస్తవం" అని ఉద్ఘాటించారు. అయోధ్యలో నేడు రామాయణ సదస్సును ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక తన పేరులో రామ్ నాథ్ అనే పదం ఉండడంపైనా ఆయన వివరణ ఇచ్చారు. రామాయణం, రాముడిపై విశ్వాసంతోనే తన కుటుంబ సభ్యులు తనకు రాముడి పేరు పెట్టి ఉంటారని భావిస్తున్నట్టు వెల్లడించారు.
అంతేకాదు, అయోధ్య నగరం పేరు వెనకున్న అర్ధాన్ని కూడా రాష్ట్రపతి వివరించారు. అయోధ్య అంటే ఎవరూ యుద్ధంలో గెలవలేని నగరం అని అర్ధం అంటూ భాష్యం చెప్పారు.