తిరగబెట్టిన మోకాలి గాయం... జడేజాకు వైద్య పరీక్షలు
- హెడింగ్లే టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా గాయం
- జడేజాకు స్కానింగ్ నిర్వహించిన వైద్యులు
- సెప్టెంబరు 2 నుంచి ఇంగ్లండ్ తో నాలుగో టెస్టు
- జడేజా ఫిట్ నెస్ పై అనిశ్చితి
టీమిండియా అగ్రశ్రేణి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయం తిరగబెట్టింది. కొంతకాలం కిందట జడేజా మోకాలి గాయానికి గురయ్యాడు. అయితే హెడింగ్లే టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా జడేజా అసౌకర్యంగా కనిపించడంతో ఆసుపత్రికి తరలించారు. జడేజా గాయానికి వైద్యులు స్కానింగ్ నిర్వహించారు. జడేజా గాయం తీవ్రతపై స్కానింగ్ లో స్పష్టత రానుంది.
ఇంగ్లండ్ తో నాలుగో టెస్టు వచ్చే నెల 2న ప్రారంభం కానుండగా, జడేజా అప్పటిలోగా గాయం నుంచి కోలుకుంటాడా? అనేది సందేహంగా మారింది. జడేజా ఫిట్ నెస్ నిరూపించుకోకపోతే అతడి స్థానంలో సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కు తుదిజట్టులో స్థానం లభించే అవకాశాలున్నాయి.