విజయనగరంలో కలకలం... క్వార్టర్స్‌లో ఎస్సై భవాని ఆత్మహత్య
- సఖినేటిపల్లిలో ఎస్సైగా చేస్తోన్న భవాని
- శిక్షణ నిమిత్తం విజయనగరానికి ఎస్సై
- ఆత్మహత్య కారణాలపై పోలీసుల దర్యాప్తు
విజయనగరంలో మహిళా ఎస్సై కె.భవాని(25) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలో భవాని ఎస్సైగా పని చేస్తున్నారు. క్రైమ్ కేసుల పరిష్కార శిక్షణ కోసం ఐదు రోజుల క్రితం ఆమె విజయనగరంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ క్వార్టర్స్ లో ఉంటున్నారు. నిన్న మధ్యాహ్నం శిక్షణ అనంతరం ఆమె తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది.
ఆ సమయంలో విశాఖపట్నంలో ఉన్న తన సోదరుడు శివకు ఆమె ఫోన్ చేసి శిక్షణ పూర్తయిపోయినట్లు తెలిపారు. గత అర్ధరాత్రి ఆమె క్వార్టర్స్‌లో తాను ఉంటోన్న గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఆత్మహత్యకు ఎందుకు పాల్పడిందో తెలియాల్సి ఉందని విజయనగరం డీఎస్పీ పి.అనిల్‌కుమార్ చెప్పారు. భవాని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భవాని సొంత ఊరు కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం అని పోలీసులు వివరించారు.