మన గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని క్రీడా మైదానాలన్నీ యువతతో నిండిపోవాలి: మోదీ
- మన్ కీ బాత్‌లో మాట్లాడిన మోదీ
- 40 ఏళ్ల తర్వాత ఈ ఏడాది ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు మెడల్
- యువతలో నేడు క్రీడా రంగం పట్ల ఆదరణ
- మన దేశ క్రీడాకారులు సాధిస్తోన్న విజయాలు ఇక్కడితో ఆగిపోకూడదు
మన్ కీ బాత్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. క్రీడారంగ అంశాలను ప్రస్తావించారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ ఏడాది ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు మెడల్ సాధించిందని చెప్పారు. ధ్యాన్ చంద్ మన మధ్యలో లేకపోయినా ఆయనకు ఈ విషయం తెలిస్తే ఎంతగా సంతోషిస్తారో మనం ఊహించుకోవచ్చని వ్యాఖ్యానించారు.
యువతలో నేడు క్రీడా రంగం పట్ల ఎంత ఆదరణ ఉందో మనం చూస్తున్నామని చెప్పారు. ఇదే ధ్యాన్ చంద్‌కు ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. మన దేశ క్రీడాకారులు సాధిస్తోన్న విజయాలు ఇక్కడితో ఆగిపోకూడదు. మన గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని క్రీడా మైదానాలన్నీ యువతతో నిండిపోవాలి.
అందరూ క్రీడల్లో పాల్గొనడంతోనే మన ప్రతిభను పూర్తి స్థాయిలో ప్రదర్శించగలుగుతామని చెప్పారు. దేశం సాధించే ప్రతి పతకం ఓ ప్రత్యేకమైన విషయమేనని చెప్పారు. స్వచ్ఛ భారత్ గురించి మోదీ మాట్లాడుతూ.. కరోనా సంక్షోభం నేపథ్యంలో స్వచ్ఛభారత్ అంశాన్ని మర్చిపోకూడదని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ స్వచ్ఛ భారత్ ర్యాంకుల్లో కొన్నేళ్లుగా నంబర్ 1గా నిలుస్తోందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
అందరూ స్వచ్ఛ భారత్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటికి 62 కోట్ల మంది కనీసం ఒక్కడోసు టీకా వేయించుకున్నారని మోదీ తెలిపారు. అయినప్పటికీ కరోనా నిబంధనలను అందరూ పాటించాల్సిందేనని సూచించారు. కాగా, మన్ కీ బాత్ లో ఏయే అంశాలపై మాట్లాడాలనే విషయంపై ఆన్‌లైన్‌లో సూచనలు చేస్తోన్న వారిలో 35 ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నారని మోదీ చెప్పారు.