ఆఫ్ఘన్‌లోని తమ కీలక స్థావరాన్ని నామరూపాల్లేకుండా పేల్చేసిన అమెరికా

  • ఎయిర్‌పోర్టు బయట సీఐఏకి స్థావరం
  • కీలక సమాచారం తాలిబన్ల చేతికి చిక్కకుండా స్థావరం పేల్చివేత
  • ఉగ్రదాడి తర్వాత కొన్ని గంటలకే ధ్వంసం
కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో అప్రమత్తమైన అమెరికా తమ కీలక స్థావరాన్ని నామరూపాల్లేకుండా ధ్వంసం చేసింది. కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం బయట అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏకి ‘ఈగల్ బేస్’ పేరుతో ఓ స్థావరం ఉంది. గురువారం ఐసిస్ ఉగ్రదాడి తర్వాత కొన్ని గంటల్లోనే అమెరికా ఈ స్థావరాన్ని పేల్చేసింది. అక్కడ చేపట్టిన చర్యల ఆనవాళ్లేవీ తాలిబన్లకు చిక్కకూడదన్న ఉద్దేశంతోనే ఈ పని చేసినట్టు ‘ది న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనంలో పేర్కొంది. కాగా, కాబూల్ ఉగ్రదాడిలో మృతి చెందిన వారి సంఖ్య 170కి పెరిగింది.


More Telugu News