కరోనాతో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు ఫహీం
- దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్‌కు అత్యంత సన్నిహితుడు
- గుండెపోటుతో మరణించాడంటున్న చోటా షకీల్
- నిర్ధారించుకుంటామన్న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు
గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్‌కు అత్యంత సన్నిహితుడైన గ్యాంగ్‌స్టర్ ఫహీం మచ్‌మచ్ కరోనాతో గత రాత్రి మృతి చెందాడు. దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్‌తో కలిసి పాకిస్థాన్‌లో ఏళ్లుగా ఉంటున్నట్టు చెబుతున్న ఫహీం కరాచీలో మరణించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని, ఫహీం దక్షిణాఫ్రికాలో గుండెపోటుతో మరణించాడని చోటా షకీల్ పేర్కొన్నాడు.
హత్యాయత్నం, హత్య, దోపిడీ వంటి కేసుల్లో ముంబై క్రైం బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు ఫహీం మోస్ట్ వాంటెడ్. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు అతడు నమ్మినబంటు. ముంబైలోని తన మనుషుల ద్వారా దావూద్ గ్యాంగ్‌కు పనులు చేసిపెడుతున్నట్టు సమాచారం. ఫహీం మృతి చెందినట్టు తమకూ సమాచారం అందిందని అయితే, ఈ విషయాన్ని నిర్ధారించుకోవాల్సి ఉందని ముంబై క్రైం బ్రాంచ్ వర్గాలు తెలిపాయి.