అమెరికాలో తొలిసారిగా జింకకు కరోనా పాజిటివ్

  • మనుషుల్లో అధికంగా కరోనా వ్యాప్తి
  • ఇప్పటివరకు కుక్కలు, సింహాలు, గొరిల్లాల్లో కరోనా
  • వైద్య పరీక్షల్లో వెల్లడైన విషయం  
  • అధ్యయనం చేపట్టిన ఓహియో వర్సిటీ
మానవుల్లో అత్యధికంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇటీవల కాలంలో జంతువులకూ సోకుతోంది. తాజాగా అమెరికాలో ఓ జింకకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆ జింకకు కరోనా ఎలా సోకిందన్నది ఇంకా తెలియరాలేదు. ఓహియో రాష్ట్రంలో ఓ అడవి తెల్ల తోక జింకకు వైద్య పరీక్షలు నిర్వహించగా, అది వైరస్ బారినపడిన విషయం వెల్లడైంది.

జంతువుల నుంచి మనుషులు-జంతువుల మధ్య కరోనా వ్యాప్తిపై ఓహియో స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన వెటర్నరీ కాలేజి పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఈ క్రమంలో కొన్ని జంతువులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఒక జింకకు కరోనా సోకిన విషయం వెల్లడైంది. ఇప్పటివరకు కుక్కలు, పిల్లులు, గొరిల్లాలు, చిరుతలు, సింహాలు కరోనా బారినపడగా, జింకకు కరోనా సోకడం ఇదే తొలిసారి.


More Telugu News