ఎస్బీఐతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న ఏపీఎస్ఆర్టీసీ

  • ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజి
  • ప్రమాద బీమా సహా అనేక సదుపాయాలు
  • ఇప్పటివరకు పోలీసులకు ఈ తరహా ప్యాకేజి వర్తింపు
  • తాజా నిర్ణయంతో 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ది
భారత ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల విద్య, వివాహ రుణాల మాఫీ, ప్రమాదాల్లో శాశ్వతంగా వికలాంగులైతే రూ.30 లక్షలు, సహజ మరణాలైతే రూ.5 లక్షలు చెల్లింపు కోసం ఎస్బీఐతో ఏపీఎస్ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిర్ణయంతో 50,500 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది.

ఏపీఎస్ఆర్టీసీ దీన్ని కార్పొరేట్ శాలరీ ప్యాకేజిగా పేర్కొంటోంది. ఇప్పటివరకు ఈ తరహా ప్యాకేజి రాష్ట్ర ప్రభుత్వంలోని పోలీసులకు మాత్రమే వర్తిస్తోంది. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. తాజాగా కార్పొరేట్ శాలరీ ప్యాకేజిని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. తద్వారా ఉచిత ప్రమాద బీమా, శాశ్వత అంగవైకల్యం, సహజ మరణం వంటి ఘటనల్లో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఏపీఎస్ఆర్టీసీ తన ఉద్యోగుల ఖాతాలను ఎస్బీఐ ద్వారానే నిర్వహిస్తోంది.


More Telugu News