నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసుల లాఠీచార్జి సిగ్గుచేటు: రాహుల్ గాంధీ

  • హర్యానాలో రైతులపై విరిగిన లాఠీ
  • కర్నాల్ లో సీఎం ఖత్తర్ సభ
  • జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు
  • నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన పోలీసులు
హర్యానాలో రైతులపై పోలీసులు తీవ్రస్థాయిలో లాఠీచార్జి చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఖండించారు. నిరసన తెలుపుతున్న రైతులపై లాఠీలు ఝళిపించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రైతు రక్తం మరోసారి చిందిందని, ఇది గర్హనీయం అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రక్తసిక్తమైన దుస్తులతో ఉన్న ఓ రైతు ఫొటోను కూడా రాహుల్ పంచుకున్నారు.

కర్నాల్ తో రైతులు ఈ మధ్యాహ్నం హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సభకు దారితీసే రోడ్లను, జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. దాంతో పోలీసులు నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. దాంతో పెద్ద సంఖ్యలో రైతులు తీవ్రంగా గాయపడ్డారు.

దీనిపై దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, విపక్షాలు మండిపడ్డాయి. కాగా, ప్రతి నిరసనకారుడ్ని టార్గెట్ చేయండి... వీపు పగిలేలా కొట్టండి అంటూ ఐఏఎస్ అధికారి ఆయుష్ సిన్హా పోలీసులకు నిర్దేశిస్తుండడం ఓ వీడియోలో వెల్లడైంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.


More Telugu News