'అనుభవించు రాజా' నుంచి ఫస్టులుక్!

  • అన్నపూర్ణ బ్యానర్లో 'ఆనుభవించురాజా'
  • కథానాయకుడిగా రాజ్ తరుణ్ 
  • రేపు నాగార్జున పుట్టినరోజు 
  • ఈ సందర్భంగా వదిలిన ఫస్టులుక్ పోస్టర్
రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'అనుభవించు రాజా' సినిమా రూపొందుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ వారు, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గవిరెడ్డి శ్రీను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రేపు నాగార్జున పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

కథాప్రకారం ఈ సినిమాలో హీరో జల్సా పురుషుడిలా కనిపిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో ఈ కథనడవనుందని తెలుస్తోంది. అక్కడ జాతర వాతావరణం .. హీరోకి పేక .. కోడి పందాలు ఆడే అలవాటు ఉందనే విషయాన్ని ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది. హీరో బంగారు ఉంగరాలు .. బ్రేస్ లెట్ పెట్టేసి శ్రీమంతుడిలా కనిపిస్తున్నాడు.

'ఉయ్యాలా జంపాలా' సినిమాతో రాజ్ తరుణ్ ను హీరోగా పరిచయం చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ వారు, మళ్లీ ఇప్పుడు ఆయనతో ఈ సినిమాను చేస్తున్నారు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.


More Telugu News