టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఇంటర్ పోల్ సహాయం తీసుకోనున్న ఈడీ
- హవాలా మార్గంలో విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నట్టు నివేదిక
- విదేశీ అకౌంట్లకు వెళ్లిన డబ్బుపై ఈడీ దృష్టి
- నోటీసులు అందుకున్న వారిలో కొత్తగా రకుల్, రానా
నాలుగేళ్ల క్రితం టాలీవుడ్ ను షేక్ చేసిన డ్రగ్స్ కేసు వ్యవహారం మళ్లీ మొదటకొచ్చింది. కేసు మరుగున పడిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో... ఊహించని విధంగా సీన్ లోకి ఈడీ ఎంటర్ అయింది. 12 మంది ప్రముఖులకు ఈడీ నోటీసులు పంపించింది. వీరిలో గతంలో విచారణకు హాజరైన వారితో పాటు కొత్తగా రకుల్ ప్రీత్ సింగ్, రానా కూడా ఉన్నారు.
మరోవైపు డ్రగ్స్ పెడ్లర్లైన కెల్విన్, కమింగా, విక్టర్ ల వాంగ్మూలాన్ని ఇప్పటికే ఈడీ సేకరించింది. అంతేకాదు విదేశీ అకౌంట్లలోకి తరలిపోయిన లెక్కలను తీయడంపై ఈడీ దృష్టి సారించింది. ఇందుకుగాను ఇంటర్ పోల్ సాయాన్ని తీసుకోబోతోంది. గత సిట్ విచారణలోనే పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. విదేశాల నుంచి డ్రగ్స్ ను దిగుమతి చేసుకున్నట్టు నివేదిక వచ్చింది. కొందరు హవాలా మార్గంలో డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్టు ఈడీ దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి. దీంతో, ఇంటర్ పోల్ సాయంతో హవాలా లావాదేవీలను తేల్చే పనిలో ఈడీ పడింది.