కిషన్ రెడ్డి, విజయశాంతి సహా ముఖ్యనేతలందరితో కలిసి భాగ్యలక్ష్మి ఆలయానికి బండి సంజయ్

  • తెలంగాణలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర
  • అమ్మవారి ఆలయంలో పూజలు
  • కాసేపట్లో పాదయాత్ర షురూ
  • నాలుగు విడతల్లో పాదయాత్ర
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. పాదయాత్ర కోసం ఇప్పటికే బీజేపీ ప్రణాళికలు రూపొందించి, భారీ ఏర్పాట్లు చేసుకుంది. 'ప్రజా సంగ్రామ యాత్ర' ప్రారంభం సందర్భంగా బండి సంజయ్ తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం హైదరాబాద్, చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్‌ఛుగ్‌, బీజేపీ నేతలు డీకే అరుణ, విజయశాంతి, అరుణ్‌సింగ్‌, లక్ష్మణ్‌తో కలిసి బండి సంజయ్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాసేపట్లో చార్మినార్‌ వద్ద సభలో నేతలు ప్రసంగిస్తారు. అనంతరం పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ రోజు పాదయాత్ర హైదరాబాద్లోని అఫ్జల్‌గంజ్‌, నాంపల్లి, లక్డీకాపూల్‌ మీదుగా మెహిదీపట్నం వరకు సాగుతుంది. ఈ రోజు రాత్రి నేతలు మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీలో బస చేస్తారు. నాలుగు విడతల్లో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర కొనసాగుతుంది.  


More Telugu News