జగన్ పెళ్లిరోజు సందర్భంగా భారీ కటౌట్ పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

  • నేడు జగన్, భారతిల 25వ వివాహ వార్షికోత్సవం
  • శ్రీకాళహస్తిలో భారీ కటౌట్ ఏర్పాటు చేసిన మధుసూదన్ రెడ్డి
  • ప్రస్తుతం కుటుంబంతో కలిసి సిమ్లాలో ఉన్న జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైయస్ భారతి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం నేడు. ఈ నేపథ్యంలో వైసీపీలో సందడి నెలకొంది. జగన్ దంపతులకు ఆ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 మరోవైపు శ్రీకాళహస్తిలో జగన్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ వెలసిన ఓ భారీ కటౌట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ కటౌట్ ను శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఏర్పాటు చేశారు. జగన్, భారతిల వివిధ ఫొటోలను ఈ కటౌట్ లో ఉంచారు. ఈ కటౌట్ కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు వివాహ వార్షికోత్సవం నేపథ్యంలో జగన్ తన కుటుంబంతో కలిసి సిమ్లాకు వెళ్లిన సంగతి తెలిసిందే.  


More Telugu News