రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి నళినికి 25 రకాల ఆరోగ్య పరీక్షలు
- ప్రస్తుతం వేలూరు సెంట్రల్ జైల్లో ఉన్న నళిని
- తరచుగా అనారోగ్యానికి గురవుతున్న వైనం
- ఫుల్ బాడీ చెకప్ చేయించాలని జైలు డాక్టర్ల సిఫారసు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషి నళిని యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. వయసు పెరుగుతుండటంతో ఆమె తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో ఆమెకు ఫుల్ బాడీ చెకప్ చేయించాలంటూ జైలు డాక్టర్లు సిఫారసు చేశారు.
ఈ నేపథ్యంలో ఆమెను పటిష్ఠ బందోబస్తు మధ్య స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు థైరాయిడ్, డయాబెటిస్, కిడ్నీ, ఈసీజీ, స్కానింగ్ తదితర 25 రకాల పరీక్షలను నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆమెను పటిష్ఠ బందోబస్తు మధ్య స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు థైరాయిడ్, డయాబెటిస్, కిడ్నీ, ఈసీజీ, స్కానింగ్ తదితర 25 రకాల పరీక్షలను నిర్వహిస్తున్నారు.