వైఎస్ వివేకా హత్య కేసు.. సునీల్ కుమార్ యాదవ్‌కు ‘నార్కో’ పరీక్షలపై విచారణ వాయిదా

  • నార్కో అనాలసిస్ పరీక్షల కోసం పది రోజుల క్రితమే పిటిషన్
  • నిన్న 45 నిమిషాలపాటు ఆన్‌లైన్ ద్వారా విచారణ
  • తదుపరి విచారణ సెప్టెంబరు 1కి వాయిదా
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సునీల్‌కుమార్ యాదవ్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలపై విచారణ మరోమారు వాయిదా పడింది. వివేకా హత్య కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ అధికారులు జమ్మలమడుగు కోర్టులో పది రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో నిన్న 45 నిమిషాలపాటు ఆన్‌లైన్‌ ద్వారా ఇరు పక్షాల వాదనలు విన్న మేజిస్ట్రేట్ తదుపరి విచారణను వచ్చే నెల 1కి వాయిదా వేశారు. మరోవైపు, ఇదే కేసులో మరో అనుమానితుడైన వివేకా డ్రైవర్ దస్తగిరితో వాంగ్మూలం ఇప్పించేందుకు నిన్న ప్రొద్దుటూరుకు తీసుకెళ్లారు. అక్కడ సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంతో దస్తగిరిని తిరిగి కడప జైలు గెస్ట్ హౌస్‌కు తీసుకొచ్చారు.


More Telugu News