అందరూ తుపాకులు కొనుక్కోవాలి: బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారో
- తుపాకులు కొనేవారిని విసిగించొద్దన్న బ్రెజిల్ అధ్యక్షుడు
- చట్టాలు మార్చడానికి గతంలో యత్నించిన ప్రెసిడెంట్
- అధ్యక్ష భవనం బయట మద్దతుదారులతో సమావేశమైన బొల్సనారో
వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బొల్సనారో.. మరోసారి వార్తల్లో నిలిచారు. తమ దేశంలోని ప్రజలందరూ తుపాకులు కొనుక్కునేలా చట్టాలు మార్చడానికి ఇదివరకు ఆయన ప్రయత్నించారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు మరోసారి ఈ విషయంలోనే బొల్సనారో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తుపాకులు కొనుగోలు చేసుకునే వారిని విసిగించడం మానుకోవాలని ఆయన తన విమర్శకులకు హితవు చెప్పారు.
బ్రెజిల్ అధ్యక్ష భవనం అల్వోరాడా ప్యాలెస్ బయట తన మద్దతుదారులతో బొల్సనారో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే తుపాకులు కొనుగోలు చేయడంపై మాట్లాడారు. వ్యక్తిగత రక్షణ కోసం బ్రెజిల్ ప్రజలందరూ తుపాకులు కొనుగోలు చేసేలా చట్టాల్లో మార్పులు చేయడానికి ఆయన గతంలో ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం మీటింగ్ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘‘తుపాకులు కొనుగోలు చేసే వారిని విసిగించకండి. అందరూ రైఫిల్స్ కొనుక్కోవాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.