కాబూల్ పేలుళ్లపై స్పందించిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్

  • తాను అధ్యక్షుడినై ఉంటే దాడులు జరిగేవి కాదన్న ట్రంప్
  • కాబూల్ విమానాశ్రయం పరిసరాల్లో రెండు బాంబు పేలుళ్లు
  • 100 మందికిపైగా మృతి.. వారిలో 13 మంది అమెరికా సైనికులు
తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్ నుంచి ప్రజలను తరలించడానికి మిగిలిన ఏకైక మార్గం కాబూల్ విమానాశ్రయం. అక్కడి నుంచే వివిధ దేశాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ గురువారం నాడు రెండు బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 100 మందికిపైగా మరణించారు. వీరిలో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. ఈ దాడులపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

ఈ నేపథ్యంలో ఈ బాంబు పేలుళ్లపై అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన.. ‘‘నేను మీ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇలాంటి విషాదం అసలు జరిగేది కాదు’’ అన్నారు. ఈ దాడులపై అంతకు ముందే స్పందించిన ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్.. కారకులపై పగ తీర్చుకుంటామని ప్రకటించారు. కాగా, ఈ దాడులకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


More Telugu News