ఓ చిన్నారికి 'తారక రామారావు' అంటూ నామకరణం చేసిన సీఎం కేసీఆర్
- కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
- తమ శిశువుకు పేరుపెట్టాలని కోరిన ఎంపీపీ దంపతులు
- చిన్నారిని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్న కేసీఆర్
- తనకిష్టమైన పేరు పెట్టిన వైనం
సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రామడుగు ఎంపీపీ కలిగేటి కవిత, లక్ష్మణ్ దంపతులు తమ చిన్నారిని సీఎం కేసీఆర్ కు అందించి, పేరు పెట్టాలని కోరారు. దాంతో సీఎం కేసీఆర్ ఆ శిశువుకు 'తారక రామారావు' అంటూ నామకరణం చేశారు.
ఆ చిన్నారి ఇంటిపేరు 'కలిగేటి' కాగా, కేసీఆర్ పేరు పెట్టిన అనంతరం 'కలిగేటి తారక రామారావు' అయింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పెట్టిన పేరు 'కేటీఆర్' ను తలపిస్తోందని టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చర్చించుకున్నారు. కాగా, ఆ చిన్నారిని సీఎం కేసీఆర్ ఎంతో లాలనగా దగ్గరికి తీసుకున్న వైనం అందరినీ ఆకట్టుకుంది.